గురు శ్రేష్ఠ - అవార్డులు అందించిన ఎంపీ
నిర్మల్ నవంబర్ 14 ( విజయక్రాంతి) : విద్యార్థుల(Students') భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల(Teachers') పాత్ర కీలకమని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్(Adilabad MP Godam Nagesh), ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా(Nirmal District) కేంద్రంలోని ఆర్కే కన్వెన్షన్ హాల్లో టీఆర్ఎస్ఎంఏ ఆధ్వర్యంలో ‘గురు శ్రేష్ఠ - 2026’ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సేవలను గుర్తించి వారిని మరింత ప్రోత్సహించేందుకు అవార్డులు అందజేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య, వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, టీఆర్ఎస్ఎంఏ నిర్మల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ పుండ్రు సుధాకర్‌రెడ్డి, నిర్మల్ పట్టణ అధ్యక్షుడు అయ్యన్నగారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.