నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన సిబ్బంది

15-11-2026 | 04:51pm

సుల్తానాబాద్ నవంబర్ 15 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ మండలం చిన్న కల్వల గ్రామానికి చెందిన ముదురుకోళ్ల రాజ్ కుమార్(Mudurkolla Raj Kumar) దివ్యాంగుడు(Person with a disability) గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో(Illness) మరణించాడు. తన కుటుంబ పరిస్థితి తెలిసిన సుల్తానాబాద్ మానసిక వికలాంగుల పునరావాస(Rehabilitation for the Mentally Disabled in Sultanabad) కేంద్రం సిబ్బంది ఆదివారం  చిన్న కాల్వల గ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి బియ్యం , నిత్యవసర వస్తువులు అందించి తమ ఔదార్యాన్నిచాటుకున్నారు.

కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేని ఆ కుటుంబానికి ఎవరో ఒకరు వచ్చి సహాయం చేసి అండగా నిలవాలని సెంటర్ ఇన్చార్జి శ్రీనివాస్  , సామాజిక కార్యకర్త దేశెట్టి రమేష్ కోరారు.తను మరణించినప్పుడు కనీసం అంతక్రియలు చేయడానికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో తలో ఒక చెయ్యి వేసి అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందని, వారికి కనీసం ఒక్క పూట తినడానికైనా అన్నం కూడా లేని పరిస్థితిలో ఉన్నారని వారి ఇంటిలో ప్రతి ఒక్కరూ దివ్యాంగులేనని వీరికి ప్రభుత్వంతో పాటు మనసున్న మహారాజులు అండగా నిలవాలని వారు కోరారు, ఈ కార్యక్రమంలో సెంటర్ సిబ్బంది సరస్వతి , కళ్యాణి , మృతుని కుటుంబ సభ్యులు ఉన్నారు.

మరిన్ని వార్తలు