సీసీ కెమెరాల నిఘాలో చందానగర్.. ప్రజా భద్రతకు పెద్దపీట

19-11-2026 | 11:13pm

శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): చందానగర్ ప్రాంతంలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు స్థానికుల భాగస్వామ్యంతో 150 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. ఈ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించగా సుమారు 300 మంది ప్రజలు పాల్గొన్నారు. శేరిలింగంపల్లి డీసీపీ చి. శ్రీనివాస్ ఐపీఎస్(Serilingampalli DCP Ch. Srinivas IPS), ఏసీపీ చి.వై. శ్రీనివాస్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కెమెరాల ఏర్పాటుకు విరాళాలు అందించిన మిర్యాల రాఘవరావు రూ.3 లక్షలు, వెర్టెక్స్ కన్‌స్ట్రక్షన్స్ రూ.3 లక్షలు, రాగం నాగేందర్ యాదవ్ రూ.2.50 లక్షలు, రమణమూర్తి, గోపాల్, రఘుపతి రెడ్డి, రాధాకృష్ణ ఒక్కొక్కరు రూ.2 లక్షలు, ప్రేమ్ కుమార్ రూ.1.50 లక్షలు అందించగా, మొత్తం రూ.18 లక్షల ఆర్థిక సహకారం లభించింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన దాతలు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, స్థానికులకు చందానగర్ పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో సాంకేతిక నిఘా వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా నేరాల నియంత్రణకు, శాంతిభద్రతల పరిరక్షణకు మరింత అవకాశం ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు