గుట్టు చప్పుడు కాకుండా..!
- వెలుస్తున్న బహుళ అంతస్తుల భవనాలు
- అక్రమార్కులకు అధికారుల అండ?
- ప్రభుత్వ ఆదాయానికి పంచాయతీ కార్యదర్శుల గండి
- కలెక్టర్ స్పందించాలని స్థానికుల విజ్ఞప్తి
కందుకూరు, నవంబర్ 11 (విజయక్రాంతి): కందుకూరు రెవెన్యూ(Kandukuru Revenue) పరిధిలోని గ్రామ పంచాయతీల్లో(Village Panchayat) ఎలాంటి అనుమతులు లే కుండా గుట్టుచప్పుడు కాకుండా బహుళ అంతస్తుల నిర్మాణాలు వెలుస్తుండటం తీవ్ర కలకలం రేపుతోంది. గ్రామ పంచాయతీ కార్యదర్శులు అక్రమంగా అనుమతులు ఇస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నిబంధనలకు నీళ్లు..
గ్రామ పంచాయతీ నిబంధనల ప్రకారం కేవలం జి+1 భవనాల నిర్మాణానికి మాత్ర మే అనుమతి ఉంటుంది. 2, 3, 4 అంతస్తుల బహుళ భవనాల నిర్మాణాలకు ఎలాం టి అనుమతులు ఇవ్వకూడదని గతంలో జిల్లా స్థాయి అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ, కందుకూరు పరిధిలో పంచాయతీ కార్యదర్శులు నిబంధనలను కాదని అక్రమ నిర్మాణాలకు కొమ్ము కాస్తున్నారనే విమర్శలు వ్యస్తున్నాయి.
రాజకీయ అండదండలు, అధికారుల లాలూచీ?
రాజకీయ నాయకుల అండదండలు, అధికారుల ప్రలోభాలతోనే తాము ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్నామని భవ న యజమానులు ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. అంతేకాకుండా, రెవెన్యూ పరిధిలోని రాచ కాలువలను సైతం పూడ్చివేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా సంబంధిత రెవెన్యూ, జిల్లా పంచాయతీ అధికారి, మండల స్థాయి అధికారులు కనీసం పర్యవేక్షించకపోవడంపై పలు అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీ అధికారుల పర్యవేక్షణ లోపం వెనుక భారీగా ముడుపులు ముడుతున్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కలెక్టర్ స్పందించాలని విజ్ఞప్తి..
ఈ ప్రాంతంలో ప్రతిరోజూ ఏదో ఒకచో ట పరిమితికి మించిన అంతస్తులు నిర్మిస్తూ దర్జాగా వ్యాపారాలు, నివాసాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి, కందుకూరు రెవెన్యూ పరిధిలో వెలిసిన బహుళ అంతస్తులపై ప్రత్యేక విచారణ జరిపించి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.