మల్లన్నసాగర్ నిర్వాసితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ విడుదల
సమస్యలు పరిష్కరించకుంటే సభ వద్దే నిరసన
గజ్వేల్, నవంబర్ 16: మల్లన్నసాగర్(Mallannasagar) ముంపు గ్రామాల భూ నిర్వాసితుల(Earthlings) సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ నిర్వాసితులు గజ్వేల్‌లోని(Gajwel) అంబేద్కర్ విగ్రహం వద్ద సమావేశమై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy)కి బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ నెల 19న సీఎం సిద్దిపేట జిల్లా(Siddipet District) పర్యటనకు వస్తున్న నేపథ్యంలో తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ లేఖ విడుదల చేసినట్లు తెలిపారు. గత బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వ హయాంలో భూసేకరణ, అర్హుల గుర్తింపు, పునరావాస ప్యాకేజీల అమలులో పారదర్శకత లేకపోవడంతో నిర్వాసితులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి నిర్వాసితులకు మద్దతుగా రెండు రోజులపాటు దీక్ష చేసి అండగా నిలిచారని గుర్తుచేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన పెండింగ్‌లో ఉన్న పరిహారాలు, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలను(R&R packages) వెంటనే మంజూరు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ నెల 19న సిద్దిపేటలో జరిగే సీఎం బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో నిర్వాసితులు హాజరవుతామని, సభలో తమ సమస్యలపై ముఖ్యమంత్రి స్పందించాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో సభ వద్దే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.