ప్రియురాలితో అర్షదీప్ ఎంగేజ్‌మెంట్

12-11-2026 | 05:15am

హామిల్టన్, నవంబర్ 11 : భారత జట్టు పేస్ బౌలర్ అర్షదీప్ సింగ్(Arshdeep Singh) త్వరలో ఇంటివా డు కాబోతున్నాడు. తన ప్రియురాలు సమ్రీన్ కౌర్‌తో(Samreen Kaur) అర్షదీన్ ఎంగేజ్‌మెంట్(Engagement) చేసుకున్నాడు.ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా వెల్లడించిన అర్షదీప్ ఫోటోలు కూడా పంచుకున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యట నలో ఉన్న అర్షదీప్ అక్కడే సమ్రీన్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆమెకు రింగ్ ఇస్తూ ప్రపోజ్ చేశాడు. బుధవారం ఇరువురు ఉం గరాలు మార్చుకున్నారు. ’నా కాబోయే భార్య’ అంటూ ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను అర్షదీప్ షేర్ చేశాడు.

‘జీవితం మనకు ఇచ్చిన గొప్ప బహుమతి మనం ఒకరికొకరం దొరకడమే. జీవితాంతం కలిసి ఉం టాం. హాయ్ కాబోయే భర్త అంటూ సమ్రీన్ క్యాప్షన్ జోడించింది. 2026 ఐపీఎల్ సమయంలో సమ్రీన్ మైదానంలో అర్షదీప్‌ను ప్రోత్సహిస్తూ కనిపించడంతో వీరి ప్రేమపై వార్తలు మొదలయ్యాయి. ఆ తర్వాత 2026 జూలైలో అర్షదీప్ తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించాడు. జమ్మూకు చెందిన సమ్రీన్ కౌర్ ఒక మోడల్ నటి. కొత్త జంటకు అంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మరిన్ని వార్తలు