అత్యుత్తమ జట్టునే దించాం

20-11-2026 | 05:10am
  1. బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్
  2. సిరాజ్‌ను పక్కన పెట్టడంపై వివరణ
  3. తుది జట్టు ఎంపికపై మాజీల విమర్శలు

వెల్లింగ్టన్, నవంబర్ 19 : న్యూజిలాండ్‌తో ఆరంభమైన తొలి టెస్టులో భారత తుది జట్టు ఎంపికపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా పేస్ పిచ్‌పై మహ్మద్ సిరాజ్‌ను ఆడించకపోవడాన్ని దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్‌తో పాటు పలువురు మాజీలు తప్పుపట్టారు. అనుభవం ఉన్న సిరాజ్‌ను పక్కన పెట్టడంపై గవాస్కర్ అసహనం వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో తొలిరోజు ఆట ముగిసిన తర్వాత టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్(Batting coach Sitanshu Kotak) స్పందించాడు. జట్టు నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు.

సిరాజ్ ప్రపంచ స్థాయి బౌలర్ అయినప్పటికీ, పిచ్ పరిస్థితులకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నాడు. ఇందులో ఎలాంటి తప్పిదం లేదని చెప్పుకొచ్చాడు. జట్టు యాజమాన్యం పిచ్ పరిస్థితు లు, ప్రత్యర్థి బలాబలాలను అంచనా వేసి అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేసిందని వివరణ ఇచ్చాడు. ఇటీవల సిరాజ్ శ్రీలంకలో ఆడిన పరిస్థితులు వేరు, ఇక్కడి పరిస్థితులు వేరని గుర్తు చేశాడు. సిరాజ్‌కు ఎ లాంటి సమస్యా లేదన్న సితాన్షు  ఇది కేవ లం పరిస్థితుల ఆధారంగా తీసుకున్న నిర్ణ యం మాత్రమే‘నని పేర్కొన్నాడు.

బేసిన్ రిజర్వ్ పిచ్‌పై గడ్డి ఉండటం వల్ల వేగం, సీమ్, స్వింగ్ రాబట్టగల కాంబినేషన్‌కు ప్రా ధాన్యం ఇచ్చామని తెలిపాడు. ఇద్దరు సీమ్ బౌలర్లు, ఇద్దరు స్వింగ్ బౌలర్లు అవసరమనే ఉద్దేశంతోనే ఈ పేస్ ఎటాక్‌ను ఎంచుకున్నామన్నాడు. కేవలం తొలి రోజు మాత్రమే కా కుండా ఐదు రోజుల ఆటను దృష్టిలో పెట్టుకుని బౌలర్లను ఎంపిక చేశామని వివరించా డు. ఇదిలా ఉంటే తుది జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ జడేజాకు సైతం చోటు దక్కలేదు.

మరిన్ని వార్తలు