నీరజ్‌కు కాంస్యం
2028 ఒలింపిక్స్‌కు అర్హత
ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్
దోహా, నవంబర్ 11: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో(ISSF World Shooting Championships) భారత షూటర్లు(Indian Shooters) సత్తా చాటుతున్నారు. తాజాగా భారత షూటర్ భారత షూటర్ నీరజ్ కుమార్(Neeraj Kumar) కాంస్య పతకం(Bronze medal) సాధించాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ వ్యక్తి గత విభాగంలో మూడో స్థానంలో నిలిచాడు. తద్వారా 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌కు(Los Angeles Olympics) కూడా అర్హత సాధించాడు. ఫైనల్లో నీరజ్ 346.5 పాయింట్లు సాధించి కాంస్యం గెలుచుకున్నాడు. అంతకుముందు క్వాలిఫికేషన్ రౌండ్లో 591 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు దూసుకొచ్చా డు.
2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ షూ టింగ్‌లో భారత్‌కు ఇది రెండో బెర్త్. రైఫిల్ విభాగంలో మొదటిది. ఇటీవల పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో జైపా ల్ మాల్వియా రజతంతో తొలి బెర్త్ దక్కించుకున్నాడు. గత కొన్నేళ్లుగా టీమ్ విభా గంలో పతకాలు సాధిస్తున్న 26 ఏళ్ల నీరజ్‌కు ప్రపంచ ఛాంపియన్షిప్ స్థాయిలో ఇది మొట్టమొదటి వ్యక్తిగత పతకం.ఇదే ఫైన ల్లో పోటీపడిన మరో భారత షూటర్ ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ 323.7 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు.