కాన్వే, రచిన్ రవీంద్ర రీఎంట్రీ

12-11-2026 | 05:05am

టెస్ట్ జట్టులోకి జాకబ్ డఫీ

భారత్‌తో సిరీస్‌కు కివీస్ జట్టు ప్రకటన

వెల్లింగ్టన్, నవంబర్ 11 : సొంతగడ్డపై భారత్‌తో(India) జరిగే రెండు టెస్టుల సిరీస్(Test series) కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు(New Zealand Cricket Board) బలమైన జట్టునే ఎంపిక చేసింది. గాయాలతో బాధపడుతున్న పలువురు ఆటగాళ్లకు చోటు కల్పించ డం ఆశ్చర్యపరిచింది. కివీస్ టెస్ట్ జట్టుకు టామ్ లాథమ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గాయాల కారణంగా బెన్ సియర్స్, జాక్ ఫౌల్కన్స్ , విల్ ఓ రూర్కే జట్టుకు దూరమయ్యారు. వీరి స్థానంలో జాకబ్ డఫీ జట్టు లోకి వచ్చాడు. మరోవైపు టామ్ బ్లండెల్, డెవాన్ కాన్వే(Devon Conway), రచిన్ రవీంద్ర(Rachin Ravindra) గాయాలతో బాధపడుతున్నా తొలి టెస్ట్ సమయానికి కోలుకుంటారని జట్టులోకి ఎంపిక చేశారు.

ఈ మార్పులు మినహా ఇంగ్లండ్ పర్యటనలో ఆడిన జట్టునే దాదాపుగా కొనసాగించారు.  2024లో భారత్‌పై 3- చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ విజయాన్ని నమోదు చేసిన న్యూ జిలాండ్ స్వదేశంలోనూ చెలరేగాలని లక్ష్యం గా పెట్టుకుంది. అప్పటి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా ఎదురుచూస్తోంది. ఇప్పటికే భారత కీలక ఆటగాళ్లు వన్డే జట్టు నుంచి తప్పుకుని రెడ్‌బాల్ క్రికెట్ కోసం సన్నద్ధమవుతున్నారు. భారత్‌తో రెం డు టెస్టుల సిరీస్ నవబంబర్ 19న ప్రారం భం కానుంది. తొలి టెస్టుకు వెల్లింగ్టన్, రెం డో టెస్టుకు క్రైస్ట్‌చర్చ్ ఆతిథ్యమివ్వనున్నాయి.

న్యూజిలాండ్ టెస్ట్ జట్టు

టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, డఫీ, మాట్ హెన్రీ, జేమీసన్, మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్న ర్, విల్ యంగ్.

మరిన్ని వార్తలు