భారత్ ఏ జట్టులో శ్రేయాంక
ముంబై, నవంబర్ 11: గాయంతో చాలా కాలంగా జాతీయ జట్టుకు దూరమైన భారత మహిళా క్రికెటర్ శ్రేయాంక పాటిల్(Indian women cricketer Shreyanka Patil) మళ్లీ గ్రౌండ్లోకి అడుగుపెడుతోంది. ఇటీవల సౌతాఫ్రికా పర్యటనకు ఎంపికవని ఆమెను సెలక్టర్లు ఇంగ్లాండ్ ఏ జట్టుతో జరిగే సిరీస్ కోసం భారత్ ఏ జట్టుకు ఎంపిక చేశారు. ఇంగ్లాండ్ ఏ జట్టుతో(England A team) మూడు ఫార్మాట్ల కోసం భారత ఏ మహిళల జట్లను సెలక్షన్ కమిటీ ప్రకటించింది.
టీ20, వన్డే జట్లకు అనుష్క శర్మ సారథిగా ఎంపికైంది. మిన్ను మణి వైస్ కెప్టెన్గా బాధ్యతలు అందుకోనుంది. ఇక మల్టీ డే మ్యాచ్ కోసం మిన్ను మణిని కెప్టెన్గా ఎంపిక చేశారు. ఇంగ్లాండ్ ఏ జట్టుతో(England A team) టీ20 సిరీస్కు(T20 series) పుణే ఆతిథ్యమిస్తుండగా, వన్డే, మల్టీ డే మ్యాచ్లు ముంబై వాంఖడే స్టేడియంలో జరగనున్నాయి.
భారత్ ఏ టీ20 జట్టు : అనుష్క శర్మ (కెప్టెన్), మిన్ను మణి (వైస్ కెప్టెన్),జి కమలిని, శిప్రా గిరి.వృందా దినేష్, తనిషా సింగ్, సానికా చాల్కే, నికీ ప్రసాద్, అమన్జోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, వైష్ణవి శర్మ, ప్రేమ రావత్, సైమా ఠాకూర్, మోనికా పటేల్, కశ్వీ గౌతమ్.
భారత్ ఏ వన్డే జట్టు : అనుష్క శర్మ (కెప్టెన్), మిన్ను మణి (వైస్ కెప్టెన్) , జి కమలిని, శిప్రా గిరి.వృందా దినేష్, తనిషా సింగ్, ప్రియా పునియా, నికీ ప్రసాద్, తేజల్ హసబ్నిస్, శ్రేయాంక పాటిల్, అమీషా బహుకండి, షబ్నమ్ షకీల్, సైమా ఠాకూర్, అక్షిత భగత్, కశ్వీ గౌతమ్
భారత్ ఏ మల్టీ డే జట్టు : మిన్ను మణి (కెప్టెన్), తేజల్ హసబ్నిస్ (వైస్ కెప్టెన్),శిప్రా గిరి, ఉమా ఛెత్రి., శుభ సతీష్, ప్రియా పునియా, తనిషా సింగ్, పూర్వజ వెర్లేకర్, హెన్రియెట్టా పెరీరా, శ్రేయాంక పాటిల్, సైమా ఠాకూర్, అక్షిత భగత్, అమీషా బహుకండి, హ్యాపీ కుమారి, షబ్నమ్ షకీల్