ఇంకుడు గుంత.. తీరని చింత..!
- భూగర్భ జలాల పెంపునకు, సమిష్టి కార్యచరణ కరువు
- పర్యవేక్షణ, క్షేత్రస్థాయి కార్యక్రమాల పట్ల అధికారులలో నిర్లక్ష్యం
- ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో అడుగంటుతున్న భూగర్భ జలాలు.
- భవిష్యత్తులో తీవ్రం కానున్న నీటి కొరత!
- ఇంకుడు గుంత నిర్మాణంతోనే భూగర్భ జలాల పెంపు
తుంగతుర్తి, నవంబర్ 19: వాతావరణ మార్పులు(Climate changes) వేగంగా విస్తరిస్తున్న తరుణంలో, భూగర్భజలాలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఎక్కడ చూసినా కాంక్రీట్ రోడ్డు భవనాలే దర్శనం మిశ్రమంతో, వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండ వృధాగా పోతుంది.
మండల వ్యాప్తంగా వేల సంఖ్యలో ఇండ్లు ఉన్నప్పటికీ, నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత ఉంటే వర్షపు నీటిని, భూమిలోకి మళ్లించి, భూగర్భ జలాలను పెంచుకునే అవకాశం ఉంది. కానీ ఆ దిశగా ప్రజల్లో అవగాహన నిర్మాణాలపై, పర్యవేక్షణ క్షేత్రస్థాయి కార్యచరణ అమలు కావడం లేదని, మేధావులు, ప్రజాప్రతినిధులు జోరుగా విమర్శలు గుప్పిస్తున్నారు.
నిబంధనలో ఉన్న-అధికారుల నిర్లక్ష్యం!:
భూగర్భజలాల(Groundwater)ను పెంపొందించుటకు భవనిర్మాణమాత్ర సమయములోని ఇంకు డు గుంతలు ఏర్పాటుకు పక్కా నిబంధనలు ఉన్నాయి మున్సిపాలిటీ పరిధిలో 300 చదరపు మీటర్లకు మించిన నిర్మాణాలు ,ఇం కుడు గుంతలు తప్పనిసరిగా ఏర్పాటు చే యాలి వాటితో పాటు 300 చదరపు మీట ర్ల లోపు ఇండ్లలోను నిర్మించాలని అనుమతి పత్రాలు పొందుపరుస్తున్నారు. భవన నిర్మా ణం పూర్తయ్యాక, ఆక్యుపెన్సి కంప్లీషన్ సర్టిఫికెట్ ,జారీ చేసే సమయంలోను వీటి నిర్మా ణాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. కానీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా, ఎం తో కొంత డబ్బులు ముట్టి చెప్పగానే, ఇల్లు కట్టిన యజమాని అడగకుండానే, కాగితంపై సంతకాలు చేస్తూ, యధా రాజా ,తథా ప్రజా అన్నట్లుగా, నిర్లక్ష్యంతో ఉద్యోగాలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
వి బి జి రాంజీ పథకంలో అవకాశం :
పట్టణాలు, గ్రామాల్లో విబిజి రాంజీ పథకంలో భాగంగా వృధాగా పోతున్న వర్షపు నీరు. ఇంటి నుండి వెళ్లే వృధా నీరు, వెళ్లే ప్రాంతాల్లో ఇంకుడు గుంతను, కొలతల ప్రకారం, నిర్మించుకోవాలి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో విబిజి రామ్ జి పనుల్లో కూడా, నిలువ కోసం మట్టిని తీసే కార్యక్రమం చేపట్టి, గులకరాళ్లు, సిమెంటుతో చుట్టూ చదును చేసి, పైపు ద్వారా, గుంతకు కలుపుకొని నీటి నిల్వ చేసే విధంగా నిర్మా ణం చేస్తున్నారు. దీనితో స్వచ్ఛమైన వర్షపు నీరు నిల్వ ఉండడానికి ఆస్కారం ఉంది. ఇం కుడు గుంతల ఏర్పాటుతో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉన్నది.
వృధాగా పోతున్న వర్షం నీరు :
గ్రామాలలో పూర్తిస్థాయిలో ఇంకుడు గుంతల నిర్మాణ వేగవంతంగా, చేపట్టకపోవడంతో చిన్న వర్షం పడితే, వర్షపు నీరు వృధాగా, నాలాల్లో చేరి, నాలాల గుండా వెళుతున్నాయి. గ్రామాలలో సైతం సీసీ ని ర్మాణాలు పెరగడంతో వర్షపునీరు భూమిలోకి ఇంగకుండా వృధాగా కాలవల్లోకి చే రుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పం దించి భవిష్యత్తులో నీటి కొరత రాకుండా ఉండేందుకు గ్రామాలలో ఇంకుడు గుంతల నిర్మాణమును యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ఇబ్బందులు రాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.
గ్రామాల్లో ఇంకుడు గుంతపై అవగాహన పెంపొందించాలి
ప్రస్తుతం పలుచోట్ల నీటి కొరతను గమనిస్తున్నాం. కాబట్టి ఇంకుడు గుంతల నిర్మాణాలపై అధికారులు, పట్టణాలలోనే కాకుండా, గ్రామాల్లో సైతం ప్రత్యే క అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో పట్టణాలు , గ్రామాలలో వర్ష నమోదు శాతం తగ్గి, భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. రానున్న రోజు ల్లో, తీవ్ర నీటి కొరత వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితిని అధిగమించాలంటే ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసి నీటిని ఒడిసి పట్టాలి. అప్పుడే నీటి కొరత లేకుండా, బోర్లు, బావులలో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది
పాలవరపు సంఘమిత్ర, ప్రకృతి సంరక్షకుడు, సలహాదారుడు.