నిరుపేదల సొంతింటి కల సాకారమే ప్రభుత్వ లక్ష్యం

14-11-2026 | 08:37pm

కీతవారిగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం

గరిడేపల్లి, నవంబర్ 14 (విజయక్రాంతి): నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మించి, సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ(vCongress People's Government) లక్ష్యమని మండల కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ చాంద్ మియా(Congress Minority Cell President Sheikh Chand Miya) అన్నారు. శనివారం మండలంలోని కీతవారిగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల(Indiramma's house) లబ్ధిదారుల(Beneficiaries) నిర్మాణ పనుల్లో భాగంగా ముగ్గులు పోయించిన అనంతరం ఆయన మాట్లాడారు. మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) సహకారంతో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరై సొంతింటి కల నెరవేరుతోందని తెలిపారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేదలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించడం గొప్ప వరమన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకుని ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బండారు సైదులు, ఎస్కె సఫియా మీరా, బండారు అంజయ్య, లబ్ధిదారులు మెరిగా రేణుక, రేఖ సైదులు, కొమరాజు నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు