నర్సంపేటలో 1,187 మందికి 'చేయూత' పింఛన్ల పంపిణీ
అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
పాల్గొన్న కలెక్టర్ డాక్టర్ సత్య శారద
నర్సంపేట, నవంబర్ 14 ( విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను(welfare schemes) అందించడమే ప్రభుత్వ లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి(Narsampet MLA Donthi Madhava Reddy) స్పష్టం చేశారు. శనివారం నర్సంపేట నియోజకవర్గంలో నిర్వహించిన చేయూత పింఛన్ల పంపిణీ(Distribution of 'Cheyutha' pensions) కార్యక్రమంలో ఆయన, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో(District Collector Dr. Satya Sharada) కలిసి లబ్ధిదారులకు(Beneficiaries) పింఛన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ వర్గాలకు చెందిన మొత్తం 1,187 మంది లబ్ధిదారులకు(Beneficiaries) పింఛన్లు మంజూరు చేశారు.
గీత కార్మికులు: 133 మంది- ఒంటరి మహిళలు: 130 మంది-వితంతువులు: 638 మంది (వీరికి నెలకు రూ.2,016 చొప్పున) దివ్యాంగులు: 286 మంది (వీరికి నెలకు రూ.4,016 చొప్పున)ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ.నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. అర్హత ఉండి ఎవరూ పింఛన్‌కు దూరం కారాదనే ఉద్దేశంతో గ్రామాల వారీగా సర్వే చేసి మంజూరు చేయిస్తున్నామని, ఎవరికైనా సమస్య ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని భరోసా ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని, ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అదనపు కలెక్టర్ వైవీ గణేష్, మున్సిపల్ చైర్మన్ పెండెం లక్ష్మి, వైస్ చైర్మన్ గంధపు నరేందర్, ఆర్డీవో ఉమారాణి, డీఆర్డీవో నాగ పద్మజ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.