అనురాగ్ లో ముగిసిన వెస్ట్ జోన్ ఎన్‌ఎస్‌ఎస్ ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ శిబిరం

19-11-2026 | 09:37pm

ఘట్ కేసర్, నవంబర్ 19 (విజయక్రాంతి) : అనురాగ్ యూనివర్సిటీలో(Anurag University) నిర్వహించిన వెస్ట్ జోన్ జాతీయ సేవా పథకం(West Zone National Service Scheme) (ఎన్ఎస్ఎస్) ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ శిబిరం–2026 ముగింపు వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్న ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, కంటింజెంట్ లీడర్లు, అధికారులు, విశ్వవిద్యాలయ ప్రతినిధుల సమక్షంలో ఈ ముగింపు వేడుకలు ఉత్సాహభరితంగా జరిగాయి.

ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్. నాగరాజు హాజరయ్యారు.  అతిథులుగా అనురాగ్ యూనివర్సిటీ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్–స్ట్రాటజీ, ట్రస్టీ అనురాగ్ పల్లా, అనురాగ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ అర్చనా మంత్రి పాల్గొన్నారు. ప్రత్యేక అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్‌ఎస్‌ఎస్ అధికారి డాక్టర్ మద్దినేని సుధాకర్ హాజరయ్యారు.

ఈ శిబిరానికి రీజినల్ డైరెక్టర్, క్యాంప్ డైరెక్టర్ ఆర్. సైదా నాయక్ నాయకత్వం వహించగా, అనురాగ్ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రీ ఆర్‌డీ క్యాంప్ కోఆర్డినేటర్ డాక్టర్ సి. మల్లేశ్ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను సమన్వయం చేశారు. నాట్ మీ, బట్ యూ–సేవే మన ధ్యేయం, ఐక్యతే మన బలం, దేశమే మన ప్రేరణ" అనే సందేశంతో ఈ ప్రీ రిపబ్లిక్ డే శిబిరం విజయవంతంగా ముగిసింది.

మరిన్ని వార్తలు