వనమా రాఘవ పుట్టినరోజు వేడుకలు

19-11-2026 | 09:45pm

కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా అంబరాన్ని అంటిన సంబరాలు

సుజాతనగర్,(విజయక్రాంతి): కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రరావు పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని గురువారం వీధి వీధినా వాడవాడలా సంబరాలు అంబరాన్నంటాయి. కొత్తగూడెం నియోజకవర్గంలో సుమారు 150 ప్రాంతాలలో వనమా వర్గీయులు, కార్యకర్తలు అభిమానులు రాఘవేంద్రరావుకు నీరాజనాలు పలికారు. నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనసారా ఆకాంక్షించారు.

వాడ వాడల్లో పిల్ల పాపలతో కలిసి కేకును కట్ చేసి మిఠాయిలను పంచుకున్నారు. అనంతరం కొత్తగూడెంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పాలు బ్రెడ్ లు అందించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు అన్వర్ పాషా, శేషాద్రి వినోద్, బొందుగుల శ్రీధర్ లు మాట్లాడారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెం నియోజకవర్గం లో అనేక ప్రాంతాల్లో అభివృద్ధి బాటలు వేశారని తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకునేలా అన్ని వర్గాల ప్రజలతో మమేకమై బిఆర్ఎస్ పార్టీ బలోపేతం చేస్తూ నాయకులకు కార్యకర్తలకు నిత్యం అండగా ఉంటూ ఎనలేని కృషి చేసిన వనమా రాఘవేంద్రరావు జీవితకాలం ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో కలకాలం ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నామన్నారు.

తన తండ్రి వనమా వెంకటేశ్వరరావు తో పాటు నేడు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దురంధరుల మధ్య తాను ఒకటిగా ఉంటూ తనకంటూ కీర్తి ప్రతిష్టలను చోరగున్నారని ఆకాంక్షించారు. ఎన్నికలప్పుడే వివిధ పార్టీల పనితీరు ఉంటుందని ఆ తర్వాత నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు నిత్యం వెన్నంటే ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాల్లో తనదైన చెరగని ముద్ర వేసుకున్నారని ఆయన సేవలను కొనియాడారు. రాజకీయాల్లో ప్రత్యేక చతురత కలిగిన వ్యక్తిగా వనమా రాఘవేందర్రావు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారని తన తండ్రి వనమా వెంకటేశ్వరరావు నడిచిన బాటలో తాను నడుస్తూ కార్యకర్తలకు వెన్నంటే ఉంటూ అనేక సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు రానున్న రోజుల్లో సంపూర్ణమైన ఆరోగ్యంతో మరిన్ని పుట్టినరోజు వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకోవాలని భగవంతుని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ జానీ ఎండి పాషా, తుంపురి ప్రసాద్ ,కొయ్యడ శ్రీను, అచ్చ నరేందర్, సురేందర్ కనకరాజు ,ఆవునూరి చంద్రయ్య, కాళీ హైమద్, మాజీ వార్డ్ మెంబర్ రేణుక తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు