ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు దుస్తుల పంపిణీ
మేడిపల్లి, సెప్టెంబర్ 19 ( విజయ క్రాంతి ): భీమారం మండలం రాజలింగంపేట గ్రామంలోని(Rajalingampeta Village) ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పలువురు దాతలు తమ ఉదారతను చాటుకుంటూ ఉచితంగా పాఠశాల దుస్తులను (యూనిఫామ్స్) పంపిణీ చేశారు. పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డుకాకూడదనే ఉద్దేశంతో దాతలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దాతలు గూగులవత్ మధు, ఎగుర్ల కుమార్, జడ నగేష్, చిట్యాల సురేష్, కుంభం అంజయ్య లతో పాటు సర్పంచ్ గాజోజి చారి, ఉప సర్పంచ్ నెరెళ్ళ సంజన రాజేందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం శ్రీనివాస్, డి శ్రీధర్, ఉపాధ్యాయులు పి రాజేంద్రప్రసాద్, సంగీత తదితరులు పాల్గొన్నారు.