పిల్లల ప్రజావాణికి విశేష స్పందన

16-11-2026 | 06:21pm

148 ఫిర్యాదులు స్వీకరణ

కామారెడ్డి, నవంబర్ 16 (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్(District Collector)  ఆదేశాల మేరకు, జిల్లా మహిళా,శిశు సంక్షేమ శాఖ(Department of Child Welfare) ఆధ్వర్యంలో సోమవారం పిల్లల ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు,  పిల్లల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమం ద్వారా  148 ఫిర్యాదులు, వినతులు అధికారులు స్వీకరించారు. 

బాలలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై పిల్లలు  తమ ఫిర్యాదులను అందజేశారు . స్వీకరించిన 148 ఫిర్యాదులను సంబంధిత అంశాల వారీగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంద అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో, బాలలకు సంబంధించిన సమస్యలను ఎవరైనా నిర్భయంగా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

బాలల రక్షణ, సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు, బాలల సమస్యల పరిష్కారంలో ప్రజలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సంబంధిత శాఖల అధికారులు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు విక్టర్, ఎన్ వై గిరి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు