పిల్లల ప్రజావాణికి స్పందన

16-11-2026 | 06:24pm

* పిల్లల సమస్యలను అడిగి తెలుసుకున్న కలెక్టర్

హనుమకొండ, నవంబర్ 16 (విజయక్రాంతి): బాలల దినోత్సవం పురస్కరించుకొని ఈ నెల 20 వరకు నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాలలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ - జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో సోమవారం రోజున కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన పిల్లల ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్(Collector Chahat Bajpai) పాయి పాల్గొని, 51 అర్జీలు స్వీకరించి, సత్వర పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు తెలియచేశారు.

పిల్లల ప్రజావాణిలో తాగునీటి వసతి, ఆధార్ కార్డులు, పాఠశాల సమీపంలో పాన్ షాప్, మద్యం దుకాణాల వలన ఇబ్బంది, హాట్ వాటర్ ఫెసిలిటీ, న్యూ బిల్డింగ్, బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలని, కుల ధృవీకరణ పత్రం కావాలని మొదలుగు సమస్యల పరిష్కారం కోరుతూ 51 అర్జీలను వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ని నేరుగా కలిసి తెలియ చేసారు. పిల్లల ప్రజావాణి కార్యక్రమం జిల్లా సంక్షేమ అధికారి ఎం విశ్వజ, బాల రక్షా భవన్ కో ఆర్డినేటర్, ఇంచార్జి డిసిపిఓ సమన్వయముతో నిర్వహించగా, ఈ కార్యక్రమంలో డీఆర్వో శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్వీ గిరిరాజ్ గౌడ్, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీధర్, బాల రక్షా భవన్ కో ఆర్డినేటర్ సిహెచ్ అవంతి, ఇంచార్జి డిసిపిఓ ఎస్ ప్రవీణ్ కుమార్, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ ఎస్. భాస్కర్, వివిధ శాఖల అధికారుల తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు