సింగారంలో న్యాయసేవాధికార సంస్థ మెగా డ్రైవ్

16-11-2026 | 06:23pm

మహాముత్తారం, నవంబర్ 16 (విజయ క్రాంతి): మహాముత్తారం మండలం సింగారం గ్రామంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ(District Legal Services Authority) ఆధ్వర్యంలో సోమవారం మెగా డ్రైవ్ ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు న్యాయ సేవలను చేరువ చేయడం, న్యాయపరమైన అవగాహన కల్పించడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

మహిళలు, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలు, ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉందని వివరించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ పి. రఘురామ్, సిబ్బంది గోపాల్, రాజ్‌కుమార్, సర్పంచ్ బెల్లంకొండ సమ్మయ్య, పంచాయతీ కార్యదర్శి ఆకుల కుమార్, అధికార మిత్రాలు పి. అంజయ్య, పి. కిరణ్, ఎల్. రమాదేవి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు