అటవీ గ్రామంలో గీతిక రెడ్డి సేవా కార్యక్రమం

14-11-2026 | 11:14pm

చర్ల, విజయక్రాంతి: బాలల దినోత్సవాన్ని(Children's Day) పురస్కరించుకొని దట్టమైన అటవీ ప్రాంతంలో(Forest area) జీవనం గడుపుతున్న కల్మషం లేని ఆదివాసి చిన్నారులతో భద్రాచలంకు(Bhadrachalam) చెందిన ప్రముఖ టీవీ9 రిపోర్టర్ కర్ర అనీల్ రెడ్డి(Prominent TV9 reporter Karra Anil Reddy) కుమార్తె కర్ర గీతిక రెడ్డి తన పుట్టినరోజును ఆనందంగా జరుపుకున్నారు.

చర్ల మండలంలోని అత్యంత మారుమూల గ్రామమైన కొండివాయిలో శనివారం ఆదివాసి చిన్నారులకు పండ్లు, మిఠాయిలు, ఆట సామాగ్రిని పంపిణీ చేశారు. చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి, వారితో సరదాగా గడిపారు.

ఈ సందర్భంగా గీతిక రెడ్డి మాట్లాడుతూ తన పుట్టినరోజును అటవీ గ్రామాల చిన్నారులతో జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని మిగిల్చిందన్నారు. బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. పిల్లలంతా చదువులో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రాజేష్, భరత్, ముఖేష్ తదితర ఆదివాసి గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు