కేసీఆర్ ని కలిసిన యువ నేత భార్గవ్ దేశ్పాండే
ఆదిలాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి) : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(BRS chief and former CM KCR) ని ఆ పార్టీ యువనేత భార్గవ్ దేశ్పాండే(Youth leader Bhargav Deshpande) మర్యాదపూర్వకంగా కలిసారు. ఎన్ ఎస్ యూ ఐ రాష్ట్ర మాజీ అద్యక్షుడు, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు భార్గవ్ ఇటువలే బీఆర్ఎస్(BRS) లో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం హైదారాబాద్ లో కేసీఆర్(KCR) ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు.
ఈ సందర్భంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ(Congress Party) ప్రజా వ్యతిరేక విధానాలపై జరిగే పోరాటానికి యువత సిద్ధం కావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ పునఃనిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని, తెలంగాణ అభివృద్ధి కోసం యువత ముందుండి పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు.