మధుమేహంపై అవగాహనతోనే వ్యాధి నియంత్రణ

14-11-2026 | 10:43pm

గజ్వేల్ లో 200 మందికి పైగా ఆరోగ్య పరీక్షలు

గజ్వేల్, నవంబర్ 14: హంస హోమియోపతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్(Hamsa Homeopathy Medical College, Hospital and Research Centre) ఆధ్వర్యంలో గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డులో(Gajwel Integrated Market Yard) శుక్రవారం మధుమేహ అవగాహన, ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరం(Free Health Check-up Camp) నిర్వహించారు.  బీహెచ్ఎంఎస్ విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు(BHMS students, NSS volunteers) పట్టణంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం కళాశాల వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ ఉమేష్ అక్కలదేవవ్ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ సరైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చన్నారు.

ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ కె. శ్రీనివాస్ బాబు పర్యవేక్షణలో 200 మందికి పైగా ప్రజలకు రక్తంలో గ్లూకోజ్ పరీక్షలు నిర్వహించి, వైద్య సంప్రదింపులు, ఆరోగ్య సూచనలు అందించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని డాక్టర్ ఉమేష్ అక్కలదేవి తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ కావ్య బోయిని, డాక్టర్ అలేఖ్య లక్కంరాజు, డాక్టర్ నిరీక్షణ్, డాక్టర్ కె. బిందు మాధవి, డాక్టర్ పుష్పలత, పీజీ వైద్యులు, ఇంటర్న్ వైద్యులు, విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు