మృతురాలి కుటుంబానికి దైద రవీందర్ భరోసా
చిట్యాల, నవంబర్ 14 (విజయక్రాంతి): చిట్యాల మండలం(Chityala Mandal) తాళ్లవెల్లంల గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త(Senior Congress party worker) జోగు లింగస్వామి(Jogu Lingaswamy) మాతృమూర్తి జోగు దుర్గమ్మ ఇటీవల మృతి చెందడంతో, శనివారం వారి కుటుంబ సభ్యులను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ఆర్థిక సాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జోగు సురేష్, ఉపసర్పంచ్ పామునుగుల్ల సునీత, బుచ్చి రాములు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జోగు చంద్రమౌళి, జంపాల వినయ్, ఏర్పుల విజయ్, అక్కెనపల్లి ఆనంద్, దొడ్డి ముత్తయ్య, నకిరేకంటి నరేష్, నక్క పెద్దసైదులు, జోగు ఎల్లయ్య, జోగు నరసింహ, ఏర్పుల అనిల్ తదితరులు పాల్గొన్నారు.