పాఠశాలల పరిసరాల్లో మత్తు పదార్థాల విక్రయాలపై పోలీసుల దాడులు

14-11-2026 | 10:55pm

ఎస్పీ నితికా పంత్

ఆసిఫాబాద్, నవంబర్ 14(విజయక్రాంతి): పాఠశాలల పరిసరాల్లో(School surroundings) మద్యం, గుట్కా, సిగరెట్ల(Alcohol, gutka, cigarettes) అక్రమ విక్రయాలను(Illegal sales) అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు(Special police checks) నిర్వహించారు. ఎస్పీ నితికా పంత్(SP Nitika Pant) ఆదేశాల మేరకు ఆసిఫాబాద్ డీఎస్పీ బి. అశోక్, కాగజ్‌నగర్ డీఎస్పీ వాహిదుద్దీన్ ఆధ్వర్యంలో శనివారం పాఠశాలల 100 మీటర్ల పరిధిలోని దుకాణాలను తనిఖీ చేశారు.

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎక్సైజ్, COTPA చట్టాల కింద 31 కేసులు నమోదు చేసి, 3.24 లీటర్ల ఐఎంఎఫ్ఎల్ మద్యం, పెద్ద మొత్తంలో పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. పాఠశాలల పరిసరాల్లో నిషేధిత ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. అక్రమ విక్రయాలపై ప్రజలు 112కు సమాచారం అందించాలని కోరారు. తనిఖీల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు