మల్లాపూర్ లో బాలల ప్రత్యేక గ్రామసభ

14-11-2026 | 11:17pm

మల్లాపూర్, నవంబర్ 14 (విజయక్రాంతి): బాలల హక్కులు, భద్రత, సంక్షేమంపై(Children's Rights, Safety, and Welfare) అవగాహన కల్పించేందుకు మల్లాపూర్ మండల(Mallapur Mandal) కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో(Gram Panchayat office premises) బాలల దినోత్సవం(Children's Day) సందర్భంగా శనివారం బాలల ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్(Major Gram Panchayat Sarpanch Chityala Lakshman) మాట్లాడుతూ మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని, గంజాయి వంటి మాదకద్రవ్యాల(Narcotics) పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాల్యవివాహాలను ప్రోత్సహించవద్దని, బాల కార్మికులను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు.

బాలల భద్రత, హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గడ్డం సోమరెడ్డి, వార్డు సభ్యులు కొంపెల్లి రాకేష్, అరికుప్పల చిన్న రాజం, ముష్కరి రమేష్, కాషవత్తుల లక్ష్మి, అల్లె లత, ఎం.డి. షబ్బీర్, భుక్యా శేఖర్, ఏనుగు లక్ష్మి, ఏఎన్ఎం భాగ్యలక్ష్మి, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు, వీఓఏలు, గ్రామ ప్రజలు, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి (ఏవీఆర్) తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు