ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో రాణించాలి
స్పెషల్ ఆఫీసర్ ఇందిరా.
కోనరావుపేట, నవంబర్ 14 (విజయక్రాంతి): భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ(Jawaharlal Nehru) జయంతిని పురస్కరించుకొని నవంబర్ 14న పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను(Children's Day celebrations) ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్ ఇందిరా(Special Officer Indira) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలలే దేశ భవిష్యత్తు అని, ప్రతి విద్యార్థి విద్యతో పాటు నైతిక విలువలు అలవర్చుకోవాలని సూచించారు. క్రీడలు, సాంస్కృతిక రంగాల్లోనూ(Sports and Cultural Sector) ప్రతిభ కనబరచాలని తెలిపారు.
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిని ఉన్నత స్థాయికి చేర్చడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.అనంతరం విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఆటపాటలు, నృత్యాలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.