స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

14-11-2026 | 10:41pm

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) తొర్రూరు పట్టణంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్  ఆధ్వర్యంలో వైద్య బృందం స్కానింగ్ సెంటర్లను(Medical team's scanning centers) తనిఖీ చేశారు. ఈ తనిఖీల సందర్భంగా గర్భిణీ స్త్రీలకు నిర్వహించిన అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలకు(Ultrasound scanning tests) సంబంధించిన ఫారం ఎఫ్ రికార్డులు, ఆడిట్ వివరాలు, స్కానింగ్ యంత్రాలు, ఇతర రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షల ద్వారా లేదా ఇతర గర్భధారణకు సంబంధించిన వైద్య పరీక్షల ద్వారా గర్భస్థ శిశువు లింగాన్ని (ఆడ లేదా మగ) నిర్ధారించడం, తెలియజేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. పీసీపీఎన్‌డీటీ చట్టం1994 నిబంధనలను ఉల్లంఘించి లింగ నిర్ధారణ చేసినా, లింగ వివరాలను వెల్లడించినా, తెలుసుకున్నా లేదా ఈ చర్యలకు సహకరించినా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ తనిఖీల కార్యక్రమంలో తొర్రూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ జలిత, మనోహర్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు