రాష్ట్రపతి భవన్ సందర్శనకు బేగంపేట విద్యార్థులకు ఆహ్వానం

14-11-2026 | 10:48pm

ఎంపీ రఘునందన్‌రావు చొరవతో పార్లమెంట్ సందర్శించే అరుదైన అవకాశం

గజ్వేల్, నవంబర్ 14 : బాలల దినోత్సవం(Children's Day) సందర్భంగా సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం బేగంపేట పాఠశాల(Begumpet School, Raipol Mandal, Siddipet District) విద్యార్థులకు రాష్ట్రపతి భవన్ సందర్శించే అరుదైన అవకాశం లభించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి విద్యార్థులకు ప్రత్యేక ఆహ్వానం అందింది. మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు(Medak MP Madhavaneni Raghunandan Rao) ప్రత్యేక చొరవతో భారత పార్లమెంట్‌ను సందర్శించే అవకాశం కూడా కల్పించారు. దేశంలోని అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థలను ప్రత్యక్షంగా చూసి తెలుసుకునే అవకాశం రావడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ పర్యటన ద్వారా దేశ చరిత్ర, ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగ విలువలు, పార్లమెంటరీ విధానాలపై అవగాహన పెరుగుతుందని ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థులకు ఇలాంటి అరుదైన అవకాశం కల్పించిన ఎంపీ రఘునందన్‌రావుకు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటన విద్యార్థుల్లో దేశభక్తి, ఉన్నత లక్ష్యాల సాధనకు స్ఫూర్తినిస్తుందని పాఠశాల వర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు