టీఎస్‌జీహెచ్‌ఎంఏ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పెద్దిరెడ్డి శ్రీధర్‌రెడ్డి
గజ్వేల్, నవంబర్ 14: తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం(Telangana State Gazetted Headmasters' Association) (టీఎస్‌జీహెచ్‌ఎంఏ) సిద్దిపేట జిల్లా(Siddipet District) ప్రధాన కార్యదర్శిగా జెడ్పీహెచ్ఎస్ సింగటంలోని ప్రధానోపాధ్యాయులు పెద్దిరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందిరానగర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో(Indiranagar ZPHS School) నిర్వహించిన సంఘం జిల్లా ఎన్నికల్లో ఆయనను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా గజ్వేల్ డివిజన్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు(Gazetted Headmasters of Gajwel Division) హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న జిల్లా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు శ్రీధర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానోపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.