బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
మున్సిపల్ మాజీ క్రిస్టియన్ కోఆప్షన్ సభ్యురాలు వంటేపాకజానకి యేసయ్య
కోదాడ నవంబర్ 14(విజయక్రాంతి) : కోదాడ నయానగర్లోని(Kodad Nayanagar) బాప్టిస్ట్ చర్చిలో(Baptist Church) క్రిస్టియన్ కోఆప్షన్ మాజీ సభ్యురాలు వంటేపాక జానకి యేసయ్య ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ(Jawaharlal Nehru) జన్మదినాన్ని పురస్కరించుకొని నవంబర్ 14న నిర్వహించిన ఈ వేడుకల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశ తొలి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ(Jawaharlal Nehru) దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్నారుల ప్రాధాన్యతను, వారి భవిష్యత్తు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ కోర్ కమిటీ చైర్మన్, వి యేసయ్య, అనంతగిరి పాస్టర్స్ ఫెలోషిప్ మండల అధ్యక్షులు ఈ. రాజేష్, కోదాడ పట్టణ పాస్టర్స్ ఫెలోషిప్ వర్కింగ్ ప్రెసిడెంట్ కర్ల ప్రభుదాస్, కోదాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.