టేకులపల్లి 900 మందికి చేయూత పెన్షన్లు మంజూరు

14-11-2026 | 10:04pm

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి (విజయక్రాంతి): పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. టేకులపల్లి మండలంలోని గోల్యాతండా గ్రామ పంచాయతీ హైస్కూల్ మైదానంలో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ల (Cheyutha Pensions) పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని 900 మంది నిరుపేద కుటుంబాలకు మంజూరైన పెన్షన్ పత్రాలను ఎమ్మెల్యే కోరం కనకయ్య లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన పేదలకు పెన్షన్లు ఎంతో ఆర్థిక భరోసా (Financial Security) కల్పిస్తున్నాయని పేర్కొన్నారు.

పెన్షన్ అనేది కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదని, అనేక నిరుపేద కుటుంబాలకు జీవనాధారమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందన్నారు. నూతనంగా పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ, అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) విద్యా చందన, ఎంపీడీవో శ్రీదేవి, తహసీల్దార్ వీరభద్రం, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, కాంగ్రెస్ నాయకులు కోరం ఉమా–సురేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాలే ప్రసాద్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కినేని శ్యామ్, మండల నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు