ప్రభుత్వ ఆసుపత్రికి త్వరలో కొత్త ఎక్స్-రే మిషన్

14-11-2026 | 11:22pm

డిసిహెచ్ఓ రాజశేఖర్ 

విజయక్రాంతి కథనానికి స్పందించిన ఉన్నతాధికారులు 

నంగునూరు : నంగునూరు ప్రభుత్వ ఆసుపత్రి(Nangunuru Government Hospital) సమస్యలపై ‘విజయక్రాంతి’ పత్రికలో వచ్చిన కథనానికి వైద్యారోగ్య శాఖ(Department of Medical and Health) ఉన్నతాధికారులు స్పందించారు. డిసీహెచ్‌ఓ రాజశేఖర్ నంగునూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు.సిబ్బందితో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

పనిచేయని ఎక్స్-రే మిషన్‌ను టెక్నీషియన్‌తో పరిశీలింపజేయగా మరమ్మతులకు పనికిరాదని తేలిందని,కొత్త మిషన్ కోసం ప్రతిపాదనలు పంపామని ఆయన తెలిపారు.తాత్కాలికంగా వేరే ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మిషన్ రప్పించి సేవలు అందిస్తామని పేర్కొన్నారు. గైనకాలజిస్ట్ విధుల్లో చేరారని, ప్రసవ సేవలు అయ్యేలా చర్యలు చేపడతామన్నారు.

మరిన్ని వార్తలు