తీన్మార్ మల్లన్నపై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
మల్లెల వీరనారాయణ
పాల్వంచ, (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ(Telangana Rajyadhikara Party) వ్యవస్థాపక అధ్యక్షులు, గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) పై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) పాల్వంచ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు మల్లెల వీరనారాయణ(Mallela Veeranarayana) మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అన్నాజీపూర్ గ్రామం సమీపంలో బీసీ రాజ్యాధికార పాదయాత్ర నిర్వహిస్తున్న తీన్మార్ మల్లన్న గారి కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని లారీతో అతివేగంగా ఢీకొట్టి హత్యాయత్నానికి పాల్పడటం అత్యంత దారుణమన్నారు. బీసీ (బహుజన) పాదయాత్రను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఈ దాడికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.
గతంలో ఇదే భువనగిరి ప్రాంతంలో బీసీల హక్కుల కోసం పోరాడిన మారోజు వీరన్న, బెల్లి లలితక్క, సాంబశివుడు వంటి ఉద్యమకారులపై జరిగిన దాడులు, హత్యలను ఈ సందర్భంగా గుర్తుచేస్తూ, అదే తరహాలో బీసీ ఉద్యమ నాయకుడు తీన్మార్ మల్లన్న ని కూడా అంతమొందించేందుకు కుట్ర జరిగిందా అనే కోణంలో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపించి, ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు.
తీన్మార్ మల్లన్నకి ఎలాంటి ప్రాణహాని కలగకుండా ప్రభుత్వం తక్షణమే Z+ కేటగిరీ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మల్లన్నకి ఏదైనా ప్రాణహాని జరిగితే బీసీ ఉద్యమ శ్రేణులమంతా తీవ్రంగా స్పందిస్తామని, బీసీ రాజ్యాధికార సాధన కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న వారు ఆకిరెడ్డి శ్రీనివాస్ – జిల్లా ప్రధాన కార్యదర్శి. అటికేటి శంకర్ – పాల్వంచ పట్టణ అధ్యక్షులు.మల్లెల నాగమణి – పాల్వంచ పట్టణ మహిళా అధ్యక్షురాలు.వట్టికోట రామకృష్ణ – బూర్గంపాడు మండల అధ్యక్షులు. విలాసాగరం కోటేశ్వరరావు – అశ్వాపురం మండల అధ్యక్షులు.మంద ఉమామహేశ్వరరావు – సుజాతనగర్ మండల యూత్ అధ్యక్షులు. రష్మిక – సుజాతనగర్ సోషల్ మీడియా కన్వీనర్. పార్టీ నాయకులు పాల్గొన్నారు.