అసమానతల ప్రపంచం

01-11-2026 | 05:00am

నేడు ప్రపంచం ఎల్ నినో(El Niño)తో పాటు అనేక సంక్షోభాలతో అతలాకుతలమవుతున్నది. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను 2030 నాటికి సాధించడానికి అనేక నూతన ఆలోచనలకు పదును పెట్టాల్సి ఉంది. నేటి డిజిటల్ ప్రపంచం వాతావరణ ప్రతికూల మార్పులు, అభివృద్ధి కుంటుపడడం, అసమానతలు, పేదరికం, ఆకలికేకలు, నిరుద్యోగం, సాంకేతిక తికమ కలు, భౌగోళిక రాజకీయ అస్థిరతలు, సాయుధ సంక్షోభాలు, యుద్ధాలు వంటి పలు సమస్యలతో సంసారం చేస్తున్నది.

వీటిలో ప్రపంచ జనాభా నేడు అసమానతల విషవలయంలో చిక్కి విలవిలలాడుతున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆర్థిక శాస్త్ర నోబెల్ పురస్కార గ్రహీత జోసెఫ్ స్టిట్లిడ్జ్ అభిప్రాయం ప్రకా రం, నేటి డిజిటల్ ప్రపంచం(Digital World) అసమానతల అత్యవసర పరిస్థితి లేదా ఇన్‌ఈక్వాలిటీ ఎమర్జెన్సీలో ఉందని హెచ్చరికలు చేశారు. ఇటీవల సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు ‘సిరిల్ రాంఫోసా’ ఏర్పాటు చేసిన జీ20 ఎక్స్‌ట్రార్డినరీ కమిటీ నివేదికను విడుదల చేశారు. ఈ కమిటీకి స్టిట్లిడ్జ్ చైర్మన్‌గా సేవలు అందించారు. నేటి విపరీత పరిస్థితుల్లో వెంటనే ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆన్ ఇన్‌ఈక్వాలిటీని ఏర్పాటు చేసి అసమానతల విషవలయాలను తొలగించే ప్రయత్నాలను చేస్తూ, ప్రపంచ దేశాలకు మార్గ నిర్దేశనం చేయాలని సూచించడం కూడా జరిగింది. 

అత్యవసర పరిస్థితిలో..

‘జీ20 ఎక్స్‌ట్రార్డినరీ కమిటీ’ అధ్యయనంలో పలు ఆసక్తికర, ఆందోళనకరమైన అంశాలు బయట పడడం జరిగింది. 2000 - మధ్య 1 శాతం ప్రపంచ సంపన్నులు 41 శాతం నూతన సంపదలను సొంతం చేసుకున్నారని, 50 శాతం ప్రపంచ పేద జనాభా కేవలం 1 శాతం సంపదను మాత్రమే పొందారని తెలుస్తున్నది. ఈ అసమానతలను తగ్గించడానికి ప్రభుత్వాల చొరవ, పాలసీల తయారీ, అంతర్జాతీయ సమాజ ఏకీకరణ జరగాలని కూడా సూచించారు.

సంపన్నుల ఆదాయంతో పాటు సంపద కూడా అనేక రెట్లు పెరుగుతున్నట్లు, అట్టడుగు పేదలకు బతుకు వెతలు, జీవనోపాద సంఘర్షణలు సాగుతున్నట్లు నివేదిక సూచిస్తున్నది. 83శాతం ప్రపంచ దేశాల్లో 90శాతం ప్రపంచ జనాభా ఉన్నదని, అసమా నతలు పెరిగినపుడు ప్రజాస్వామ్య స్ఫూర్తి పూర్తిగా పలుచబడుతుందని, అశాంతి పురుడు పోసు కుంటుందని తెలిపారు. ఒక శాతం సంపన్నుల సగటు సంపద పెరుగుదల 1.3 మిలియన్ డాలర్లు ఉండగా, 50 శాతం పేద జనాభా సగటు ఆదాయం/సంపద కేవలం 585 డాలర్లు పెరిగిందనే సంచలన విషయాలను బహిర్గత పరిచింది.

ప్రపంచ స్థాయిలో ఆదాయ మార్గాలు పెరగడంతో ప్రజల్లో అసమానతలు కొంత తగ్గుతున్నట్లు తెలియజేస్తున్నారు. ఎన్ని జరిగినా ఉత్తర దేశాలకు(గ్లోబల్ నార్థ్), దక్షిణ దేశాలకు (గ్లోబల్ సౌత్) మధ్య ఆదాయ వ్యత్యాసాలు అధికంగా ఉన్నట్లు తేల్చారు. అధ్యయన సంస్థ సూచనల ప్రకారం సంపన్నులు, బహుళజాతి కంపెనీలపై తగు రీతిలో పన్నులను పెంచడం, దేశాలు స్థానిక ప్రజల కేంద్రంగా అభివృద్ధి పథంలో నడవడంతో పాటు ఆయా దేశాల్లోని సంపన్నులపై పన్నులు పెంచడం జరగాలని సూచించింది.

వివిధ దేశాల మధ్య సానుకూల సంబంధాలు బలపడడం, అంతర్జాతీయ వాణిజ్యం పెరగడం, పర్యా వరణహిత అభివృద్ధికి బాటలు వేయడం నిరంతరం జరగాలని అభిప్రాయపడింది. నేను బా గుండాలంటే నా చుట్టు ఉన్న జనులు, పర్యావరణం కూడా బాగుండాల్సిం దే అనే సరికొత్త భావనలు చిగురింపజేయాలి. ప్రజల మధ్య సంఘీభావం, సమానత్వం, సు స్థిరాభివృద్ధి లక్ష్యాలను సుసా ధ్యం చేసుకోవాల్సిన అత్యవసర సమయం ఆసన్నమైనదని గమనించి నడుచుకోవాలి. సమాన త్వం సాధించిన ప్రపంచాన్ని నిర్మించుకోవాలి. 

వ్యాసకర్త సెల్: 9949700037

డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి

మరిన్ని వార్తలు