కంగ్టి ఎంపీడీఓగా సుభాష్ చంద్రగౌడ్ బాధ్యతల స్వీకరణ

20-11-2026 | 12:33am

కంగ్టి,(విజయక్రాంతి): కంగ్టి మండల పరిషత్ అభివృద్ధి అధికారి(Kangti Mandal Parishad Development Officer)గా సుభాష్ చంద్రగౌడ్(Subhash Chandragoud) బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థలో ఫ్యాకల్టీగా విధులు నిర్వహించిన ఆయన బదిలీపై కంగ్టి మండలానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు సకాలంలో అందేలా చూడటం, గ్రామపంచాయతీల అభివృద్ధిని వేగవంతం చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి చేపడుతున్నట్టు తెలిపారు.

ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యేలా, గ్రామస్థాయిలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా సంబంధిత శాఖల సమన్వయంతో పనిచేయడం ఎంపీడీఓగా ప్రధాన బాధ్యతగా తీసుకుంటానని అన్నారు . మండల అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో సమష్టి కృషి కీలకమనే పరిపాలనా దృక్పథంతో ముందుకు సాగుతామన్నారు .

మరిన్ని వార్తలు