పీఎం రాహత్ పథకం కింద ప్రమాద బాధితులకు ఆసుపత్రి బిల్లుల చెల్లింపు
హనుమకొండ, నవంబర్ 16 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు పీఎం రాహత్ పథకం కింద వైద్య ఖర్చులను సంబంధిత ఆసుపత్రులకు బిల్లుల చెల్లింపు మంజూరు నిమిత్తం హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి(District Collector Chahat Bajpai) విడుదల చేశారు. ఈ రోజు ఎన్ఐసీ జిల్లా మేనేజర్ శివకుమార్ సోమవారం జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ ను కలిశారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన ఇద్దరు రోడ్డు ప్రమాద బాధితుల వైద్య ఖర్చులను ఈ పథకం కింద ఆసుపత్రులలో అయిన బిల్లులను జిల్లా కలెక్టర్ మంజూరు చేశారు. ఈ సందర్బంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, సి సెక్షన్ సూపరింటెండెంట్ చల్ల ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.