సత్తుపల్లిలో చల్లగుళ్ల నరసింహారావుకు ఘన స్వాగతం

16-11-2026 | 08:57pm
  1. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం..
  2. జేవియర్ పార్క్ నుంచి మార్కెట్ వరకు భారీ బైక్ ర్యాలీ

సత్తుపల్లి. నవంబర్ 16. ( విజయ క్రాంతి ): వ్యవసాయ మార్కెట్ కమిటీ(Agricultural Market Committee) చైర్మన్‌గా చల్లగుళ్ల నరసింహారావు ఎన్నికైన సందర్భంగా సోమవారం సత్తుపల్లి పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని జేవియర్ పార్క్ నుంచి వ్యవసాయ మార్కెట్ వరకు సాగిన ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చల్లగుళ్ల నరసింహారావు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా చల్లగుళ్ల నరసింహారావు మాట్లాడుతూ.. తనను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎంపిక చేసిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్‌కు, ఆ ఎంపికను ఆమోదించి 36 సంవత్సరాలుగా తనకు రాజకీయంగా అవకాశం కల్పిస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్‌గా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, జిల్లా కలెక్టర్ దివాకర్, డీసీసీబీ చైర్మన్ నూతి సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ చైర్‌పర్సన్, వివిధ శాఖల అధికారులు, వార్డు కౌన్సిలర్లు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు