రైల్వే స్థలం కేటాయింపు శుభపరిణామం

16-11-2026 | 08:53pm

నిరంతర కృషితోనే రోడ్డు విస్తరణ సాధ్యమైంది

హేమచంద్రాపురం రోడ్డుకు తీరనున్న ట్రాఫిక్ కష్టాలు

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

భద్రాద్రి కొత్తగూడెం , నవంబర్ 16 (విజయక్రాంతి): రైల్వే స్టేషన్ నుంచి హేమచంద్రాపురం వరకు రహదారి విస్తరణకు 20 ఫీట్ల స్థలాన్ని కేటాయించేందుకు రైల్వే శాఖ అంగీకరించడం శుభపరిణామమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Sambasiva Rao) అన్నారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజల చిరకాల వాంఛ అయిన ఈ రోడ్డు విస్తరణ కోసం రైల్వే ఉన్నతాధికారులతో పలుమార్లు చర్చలు జరిపి, వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు.

తమ నిరంతర కృషికి ఫలితంగా రైల్వే శాఖ సానుకూలంగా స్పందించి స్థలం కేటాయించేందుకు ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ రహదారిని మరింత సుందరంగా, సురక్షితంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు నిమిత్తం రూ. కోటి నిధులను కేటాయించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ విస్తరణ పనులు పూర్తయితే రైల్వే స్టేషన్ నుంచి హేమచంద్రాపురం మార్గంలో నిత్యం ఎదురవుతున్న తీవ్ర ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు