నూతన వధూవరులను ఆశీర్వదించిన కేటీఆర్
గిరిజన తండాలో కేటీఆర్ రాకతో సందడి.. మురిసిపోయిన నూతన దంపతులు
గంభీరావుపేట, నవంబర్ 16 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం జగదంబా తండాలో జరిగిన వివాహ రిసెప్షన్ వేడుకకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(BRS Party Working President, MLA KTR) హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. యూకేలో స్థిరపడిన ఎన్‌ఆర్‌ఐ భూక్యా ప్రశాంత్-వసంత దంపతుల వివాహ రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ వారికి శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు.
గిరిజన తండాకు విచ్చేసి తమను ఆశీర్వదించడం పట్ల నూతన దంపతులు ప్రశాంత్, వసంత ఆనందం వ్యక్తం చేస్తూ కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్ రాకతో జగదంబా తండాలో సందడి నెలకొనగా, నూతన వధూవరులు ఆనందంతో మురిసిపోయారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాపగారి వెంకటస్వామి గౌడ్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.