లబ్ధిదారులకు చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ
16-11-2026 | 08:54pm
ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో కలిసి అందజేసిన సర్పంచ్ స్వామి
కొల్చారం, నవంబర్ 16: కొంగోడ్ గ్రామానికి మంజూరైన చేయూత పెన్షన్లకు సంబంధించిన మంజూరు పత్రాలను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి(MLA Sunitha Lakshma Reddy)తో కలిసి గ్రామ సర్పంచ్ దుబ్బగళ్ల స్వామి లబ్ధిదారులకు అందజేశారు. అర్హులైన పేదలకు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లు ఆర్థిక భరోసాగా నిలుస్తాయని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అర్హులకు పెన్షన్లు మంజూరు చేయడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు