పట్ట భద్రుల గళం అయిత, బీసీ బిడ్డల స్వరం అయిత
వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల MLC అభ్యర్థి. శ్రీకాంత్ గౌడ్..
బహుజన బిడ్డను గెలిపిద్దాం ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుద్దాం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇన్చార్జ్ ఇస్మాయిల్
కొత్తగూడెం నవంబర్ 16 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలక పక్షాలు సామాజిక న్యాయం పాటించకుండా అగ్రవర్ణాలకు పెద్దపీట వేయగా కాకతీయ విశ్వవిద్యాలయం నుండి తెలంగాణ ఉద్యమంలో అనేక సమస్యలు ఎదుర్కొని పోరాటం చేసిన బహుజన బిడ్డగా మీ ముందుకు వస్తున్నానని, గతంలో వాగ్దానాలు చేసిన వ్యక్తులు, పాలక పక్షాలకు తోత్తులుగా మారిన సందర్భంలో విద్యార్ధి ఉద్యమ నాయకునిగా తమకు అండగా నిలుస్తానని నిరుద్యోగుల సమస్యలు తెలిసిన వాడిగా కాకతీయ విశ్వవిద్యాలయం(Kakatiya University) విద్యార్థి గా పిహెచ్డి సాధించి ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా పేదరికం నుంచి ప్రజా సమస్యలు తెలిసిన పౌరుడిగా మీ ముందుకు వస్తున్నానని మీలో ఒకడిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల బిడ్డగా నన్ను ఆశీర్వదించి, సేవ చేసే భాగ్యం కల్పించాలని తెలంగాణ రక్షణ సేన వరంగల్ నల్గొండ, ఖమ్మం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జ్ ఇస్మాయిల్, అభ్యర్థి నలమాస శ్రీకాంత్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దళిత బీసీ వర్గాల బిడ్డగా మహబూబాద్ ప్రాంతానికి చెందిన ఒక బీసీ బిడ్డను ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిపి ,పేద వర్గాల అభ్యున్నతి కోసం కవితమ్మ చేస్తున్న కృషికి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులు అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు.
భారత రాష్ట్ర సమితి ప్రజలను మోసం చేసిందని విద్యార్థి ఉద్యమకారులను విస్మరించి, కేవలం ఆర్దిక అవసరాలే ప్రధాన అంశాలుగా అభ్యర్థులను నిలబెట్టి ఉద్యమకారులకు మోసం చేసిందని, అధికార కాంగ్రెస్ పార్టీ అనేకమైన హామీలు ఇచ్చి ఎన్నికల్లో విజయం సాధించినాక హామీలన్నీ తుంగలో తొక్కి, కేంద్రంలో అధికారం చేలా ఇస్తున్న బిజెపి , రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రజలకు కుచ్చుటోపి పెట్టిందని ,దేశంలో ఉన్నటువంటి ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే, పోస్ట్ ఆఫీస్, ఇంకా అనేక రంగాలు ప్రైవేట్ పరం చేస్తూ, ప్రజలను హత పాతాళానికి తొక్కేస్తుందని ప్రజలతో సంబంధాలు లేని వారిని ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి స్థానిక ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితిలు తీసుకొస్తుందని యద్దేవా చేశారు.
బీసీ బిడ్డగా ప్రాంత వాసిగా ఉద్యమ నేతగా తాను చేసిన సేవలను గుర్తు ఉంచుకొని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత ఆశీర్వాదంతో తనకిచ్చిన ఈ టికెట్ అశోక్ నగర్ సాక్షిగా నిరుద్యోగులుగా అవస్థలు పడుతున్న యువత అందరికీ, తాను అండగా ఉంటానని గతంలో హామీలు ఇచ్చి గెలిచిన వ్యక్తులు అధికార పార్టీలకు తొత్తులుగా మారినట్లు తాను మారని ప్రమాణ పూర్తిగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు క్షేత్రస్థాయిలో తెలిసిన వ్యక్తిగా నెరవేరుస్తానని తనకు పట్టబద్రులు అవకాశం కల్పించి తన భుజాలపై చేతులు వేసి పనులు చేయించుకునే విధంగా నడుచుకుంటారని ఎమ్మెల్సీ అభ్యర్థి స్పష్టం చేశారు.
ఖమ్మం జిల్లా లో విశారదన్ మహారాజ్ తో కలసి 3రోజులు నరవదికగా దీక్ష చేసి, 400 కుటుంబాలకు ఇండ్ల పట్టాలు ఇప్పిచాము రాహుల్ గాంధీ రోహిత్ వేముల చట్టం తెస్తామని ప్రమాణం చేసి పోయినాడు ఆ తర్వాత మేము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పోయి నీలాదీస్తే రెండు రోజుల తరువాత మంత్రి వర్గాని ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఈ రోజు కొత్తగూడెం అంటే నే సింగరేణి మణికంఠం లాంటిది అలాంటి సింగరేణినీ ఇక్కడి బొగ్గు గనులను కేంద్రం ప్రైవేట్ పరం చేస్తూ బొగ్గు గనులను అమ్ముతుంది ఇక్కడ బిడ్డల ఉద్యోగాలను గాలి కీ వదిలేసి అమ్ముకొంటుంది కొత్తగూడెం లో డిగ్రీ చేసి కోల్ బెల్ట్ లో కాంట్రాక్ట్ కూలీలుగా నా పట్టభద్రుల బిడ్డలని ఉంచుతున్నారు.
పోడు భూముల కోసం నా గ్రాడ్యుయేట్ బిడ్డలు పోరాడుతున్నారు అయినా భూమి కి పట్టలేదు, నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగం రావడం లేదు ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అని డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ ఏద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డి.వీరన్న, ఖమ్మం జిల్లా పార్లమెంటు ఇంచార్జీ అనిత చౌదరి, రాష్ట్ర ఐటీ వింగ్ అధ్యక్షుడు ఎల్ కె. అశోక్ కుమార్, టీ ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సముద్రాల క్రాంతి, , మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి చైతన్య, ఇల్లందు నియోజకవర్గ ఇన్చార్జి వాసం రామకృష్ణ దోర, పినపాక నియోజకవర్గ ఇంచార్జి కోరం గణేష్, కార్మిక విభాగం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వాంకుడుతో రవి, ముసల రామకృష్ణ, విద్యార్థి విభాగం జిల్లా నాయకులు లకావత్ సురేష్, మహిళా విభాగం జిల్లా నాయకురాలు గాయత్రి తదితరులు పాల్గొన్నారు.