బైండోవర్ షరతులు ఉల్లంఘించిన మహిళకు జరిమానా

16-11-2026 | 08:51pm

ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు : ఎక్సైజ్ సీఐ విజేందర్

గంభీరావుపేట, నవంబర్ 16 (విజయక్రాంతి): బైండోవర్ షరతులను ఉల్లంఘించిన మహిళకు ఎక్సైజ్ శాఖ అధికారులు(Excise Department officials) రూ.30 వేల జరిమానా విధించారు. ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్ గ్రామానికి చెందిన బానోత్ కాంతి (భర్త మోహన్) గతంలో బైండోవర్ చేయబడగా,

రెవెన్యూ అధికారులు (ఎంఆర్ఓ) విధించిన నిబంధనలను ఉల్లంఘించినట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో బైండోవర్ షరతుల ఉల్లంఘనకు గాను ఆమెకు రూ.30,000 జరిమానా విధించినట్లు ఎక్సైజ్ సీఐ రెండ్ల విజేందర్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే పీడీ యాక్ట్ కింద కూడా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు