ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రైతులతో కలిసి ధర్నా

16-11-2026 | 09:01pm

చిట్యాల, నవంబర్ 16(విజయ క్రాంతి ): రామన్నపేట మండల కేంద్రంలో(Ramannapet Mandal Headquarters) ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(Former Nakrekal MLA Chirumarthi Lingaiah) సందర్శించి, రైతులతో కలిసి మార్కెట్ యార్డులో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ

సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి నెల రోజులు దాటినప్పటికీ ఇప్పటివరకు కనీసం ధాన్యం తేమ శాతం పరీక్షలు కూడా నిర్వహించడం లేదని విమర్శించారు.

ఉద్దేశపూర్వకంగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రైతులతో మాట్లాడి ధాన్యం కొనుగోళ్లలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితులను పరిశీలించి, రైతులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు