నర్మెట్ట బాలల దినోత్సవం గ్రామసభ వేడుకలు
నర్మెట్ట, నవంబర్ 14 (విజయక్రాంతి): నర్మెట్ట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ (Grama Sabha) ఘనంగా నిర్వహించారు. జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ (Children's Day) వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs), ఆటపాటలతో అందరినీ అలరించారు. వివిధ కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన పిల్లలకు సర్పంచ్ శ్రీధర్ గౌడ్ బహుమతులు అందజేశారు.
అనంతరం సర్పంచ్ శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి పౌరులని, వారి ఉజ్వల భవిష్యత్తుకు, సర్వతోముఖ అభివృద్ధికి గ్రామ పంచాయతీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి సుమన్, కార్యదర్శి నసీరుద్దీన్, ఉప సర్పంచ్ కోలెపాక స్వామి, వార్డు సభ్యులు కొలెపాక యాదగిరి, చెప్పాల మహిపాల్ రెడ్డి, పొన్నం బాలకృష్ణ, కొన్నే యాదలక్ష్మి చంద్రయ్య, కూకట్ల మమతా సంపత్, తుప్పుడు శ్రావణి మహేష్, గోరంతల స్వాతి రాజు, పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.