పలుగుల రోడ్డుకు మోక్షం ఎప్పుడు?

14-11-2026 | 09:55pm

పలుగుల రోడ్డు నిర్మాణం చేయాలని బీఆర్ఎస్ పాదయాత్ర

మహదేవ్‌పూర్,(విజయక్రాంతి): మహదేవ్‌పూర్(Mahadevpur) మండలంలోని పలుగుల-కుంట్లం రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వంలో కీలక మంత్రి హోదాలో ఉన్న శ్రీధర్ బాబు(MLA Sridhar Babu) 13.03.2026న రూ.22 కోట్ల నిధులతో పలుగుల రోడ్డు 7 కి.మీ నూతనంగా నిర్మించుటకు కాళేశ్వరంలో శంకుస్థాపన చేశారని, 8 నెలలు (246 రోజులు) గడుస్తున్నా రోడ్డు నిర్మాణం శిలాఫలకానికే పరిమితమైందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు.

శిలాఫలకాల కోసం హడావుడి తప్ప పనులు మొదలుపెట్టడంలో శ్రద్ధ ఏదని ప్రశ్నించారు. మొద్దు నిద్రలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యే మంత్రి  ని మేలుకొల్పేందుకే ఈ యాత్ర చేపట్టామని బి ఆర్ ఎస్ నాయకులు పేర్కొన్నారు. పలుగుల రోడ్డు  పనులు వెంటనే ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు