విద్యా రంగానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట

16-11-2026 | 05:56pm
  1. గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ 
  2. మోడల్ స్కూల్ విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్ ప్రత్యేక తరగతులు ప్రారంభం 

గణపురం, నవంబర్ 16 (విజయ క్రాంతి):విద్యా రంగానికి ప్రజా ప్రభుత్వం(People's Government) పెద్దపీట వేస్తుందని గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్(Ganapuram Sarpanch Katkuri Radhika Srinivas) అన్నారు. తెలంగాణ విద్యాశాఖ ఆధ్వర్యంలో గణపురం మోడల్ స్కూల్ విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షల కోసం ప్రత్యేక తరగతులు.

ప్రారంభించినట్లు ఎంఈఓ అఫ్రోజ్ అహ్మద్, సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్, ప్రిన్సిపల్ తిరుపతి తెలిపారు. నవంబర్ 18 నుంచి ప్రతిరోజూ ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 3.30 నుంచి 5.30 గంటల వరకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని పేర్కొన్నారు.

విద్యార్థులకు అవసరమైన ప్రిపరేషన్ సామగ్రితో పాటు ప్రత్యేక బోధకుల ఖర్చులను కూడా ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. ప్రతిష్టాత్మక ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందేందుకు విద్యార్థులకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని, మోడల్ స్కూల్ విద్యార్థులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు