మోదేడులో పోలీసుల కార్డన్ సెర్చ్

14-11-2026 | 10:10pm

పలిమెల, నవంబర్ 14(విజకయాక్రాంతి ) : పలిమెల మండలంలోని(Palimela Mandal) మోదేడు గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్(Cordone and Search Operation) నిర్వహించారు. మహాదేవపూర్ సీఐ ఎన్. వెంకటేశ్వర్లు(Mahadevpur CI N. Venkateswarlu) పర్యవేక్షణలో, పలిమెల ఎస్ఐ టి. సాయి శశాంక్ ఆధ్వర్యంలో సివిల్ పోలీస్(Civil Police) మరియు టీజీఎస్పీ సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోలీసు బృందాలుతెల్లవారుజామునే మోదేడు గ్రామానికి చేరుకొని గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో పాటు ఇంటింటా సోదాలు చేపట్టారు. గ్రామంలో గుడుంబా తయారీ, విక్రయాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం, అసాంఘిక శక్తుల కదలికలను నియంత్రించడం మరియు యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి మార్గంలో నడిచేలా అవగాహన కల్పించారు. 

ఈ తనిఖీలలో భాగంగా అక్రమంగా నిల్వ ఉంచిన 5 లీటర్ల గుడుంబాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా నిల్వ చేసిన వ్యక్తులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదుచేశారు.గ్రామంలో వాహనాలను తనిఖీ చేసి, నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, సరైన వాహన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలపై నిబంధనల ప్రకారం జరిమానాలు విధించారు.

గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, అక్రమ కార్యకలాపాల నియంత్రణ, గుడుంబా వంటి మత్తు పదార్థాల నిర్మూలన కోసం పోలీసుల తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. ప్రజలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

మరిన్ని వార్తలు