22న కరీంనగర్ సదర్ సమ్మేళన
ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ సదర్ కమిటీ(Karimnagar Sadar Committee), ఆల్ ఇండియా మహాసభ ఆధ్వర్యంలో నగరంలోని జ్యోతిబా పూలే మైదానంలో ఈనెల 22 ఆదివారం సాయంత్రం నిర్వహించనున్న సదర్ సమ్మేళన వేడుకలకు ముఖ్యఅతిథులుగా విచ్చేయాలని కోరుతూ... బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రస్తుత నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ను కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా భగత్ నగర్ లోని క్యాంపు కార్యాలయంలో వారికి సదర్ ఉత్సవ ఆహ్వాన పత్రికను అందజేసి, వేడుకల విశేషాలను వివరించారు. ఉత్సవాలకు తప్పకుండా హాజరై వేడుకలను విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు. ఇందుకు యాదగిరి సునీల్ రావు సానుకూలంగా స్పందించి, సదర్ ఉత్సవాల విజయవంతానికి తమ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సదర్ ఉత్సవ కమిటీ సభ్యులు సందబోయిన రవి యాదవ్, సందబోయిన ప్రసాద్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.