రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

16-11-2026 | 06:48pm

ఏఎంసీ చైర్మన్ రేవెల్లి రాజలింగం

మానకొండూరు, నవంబర్ 16 (విజయక్రాంతి): ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను(Paddy grain purchasing center) రైతులు సద్వినియోగం చేసుకోవాలని మానకొండూరు ఏఎంసీ చైర్మన్ రేవెల్లి రాజలింగం రైతులకు సూచించారు. ధాన్యం దళారులకు విక్రయించవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించి మద్దతు ధర 2,461 రూపాయలు పొందాలని రైతులను కోరారు.

సోమవారం మానకొండూరు సహకార సంఘ పరిధిలోని లింగాపూర్, అన్నారం, కెల్లేడు, కొండపల్కల, గంగిపల్లి, గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మానకొండూరు సహకార సంఘ అధ్యక్షులు నాగిశెట్టి రాజయ్య, వైస్ చైర్మన్ రేమిడి శ్రీనివాసరెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ పాలకవర్గ సభ్యులు,సహకార సంఘ పాలకవర్గ సభ్యులతో తో కలిసి ఆయన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

ధాన్యాన్ని శుభ్రపరిచి కొనుగోలు కేంద్రాలలో  విక్రయించాలని,తాలు సాకు చూపి, తరుగు ఎక్కువగా తీసే అవకాశం రైస్ మిల్లర్లకు ఇవ్వవద్దని ఆయన రైతన్నలను కోరారు. 40 కిలోల 600 గ్రాములు శుభ్రపరిచిన ధాన్యాన్ని తూకం వేస్తారని చెప్పారు. సన్నాలకు 500 రూపాయల బోనస్ లభిస్తుందని రాజలింగం రైతులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో లింగాపూర్ గ్రామ సర్పంచ్ మోటం సమ్మక్క సమ్మయ్య, ఉప సర్పంచ్ తాళ్ల వెంకటేశం, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్టల కృష్ణ, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు