రాష్ట్రస్థాయి చదరంగ పోటీలకు విద్యార్థిని ఎంపిక
16-11-2026 | 06:49pm
చేగుంట నవంబర్ 16, (విజయక్రాంతి): 70వ ఎస్‌ఎస్‌జీ అండర్-17 క్రీడల్లో భాగంగా గాజ్వెల్ పట్టణంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి చదరంగ పోటీల(State Level Chess Tournament)కు చేగుంట ఆదర్శ పాఠశాల విద్యార్థిని కే. తేజస్విని ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రిన్సిపల్ చంద్రకళ, వ్యాయామ ఉపాధ్యాయుడు గాండ్ల దిలీప్‌తో పాటు ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తేజస్వినిని అభినందిస్తూ, రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి కళాశాలకు, మండలనికి మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థినిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులను పలువురు అభినందించారు.